రేపు తెలంగాణ బంద్ కొనసాగబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ బంద్ కు మాల మహానాడు అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో… మాల కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని ఒక చర్చ జరుగుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాల మహానాడు సభ్యులు.. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఈ తరుణంలోనే ఫిబ్రవరి 14 అంటే రేపు తెలంగాణ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది.
ఇది రాజ్యాంగ వ్యతిరేకమని… నిర్ణయాలు తీసుకునే ముందు నేషనల్ ఎస్సీ కమిషన్ ను సంప్రదించాల్సి ఉందని… మాల మహానాడు సమితి నాయకులు ఫైర్ అవుతున్నారు. ఇక రేపటి తెలంగాణ బంద్… కారణంగా… ఆర్టీసీ బస్సులు అలాగే విద్యా సంస్థలు… బ్యాంకులు, ఇతర సేవలపై ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే తెలంగాణ బంద్ నేపథ్యంలో… మాల మహానాడు నేతలను అరెస్టు చేయాలని… రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.