కొడాలి నానిని కట్ డ్రాయర్ మీద ఊరేగిస్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. గన్నవరం సభలో వైసీపీకి నారా లోకేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. కృష్ణా జిల్లా మనవడిగా.. అల్లుడిగా పాదయాత్ర చేయడం నా అదృష్టం అని.. జగన్ పిరికి వాడని తెలిపారు. జగన్ పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం అవసరానికి మించి సెక్యూర్టీ కల్పించామని.. పాదయాత్ర చేసుకో బిడ్డ అంటూ పంపామని వివరించారు.
నేను పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి అడుగుడగునా అడ్డుకున్నారని.. ఆనాడే చెప్పాను.. సాగనిస్తే పాదయాత్ర లేకుంటే దండయాత్ర అని చెప్పానని చురకలు అంటించారు నారా లోకేష్. మన తల్లి ని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన కొడాలి నాని గాడిని గుడివాడ సెంటర్ లో కట్ డ్రాయర్ మీద ఊరేగింపు చేసే బాధ్యత నాదంటూ హెచ్చరించారు నారా లోకేష్. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే జగనుకు కాలినొప్పి వచ్చిందని.. ఇచ్చిన హామీల విషయంలో పదే పదే మడమ తిప్పాడు.. అందుకే మడమ నొప్పి వచ్చిందని ఎద్దేవా చేశారు.
మన తల్లి ని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన కొడాలి నాని గాడిని గుడివాడ సెంటర్ లో కట్ డ్రాయర్ మీద ఊరేగింపు చేసే బాధ్యత నాది
గన్నవరం సభలో నారా లోకేష్ మాస్ వార్నింగ్ pic.twitter.com/1JCb8J7fxo
— Telugu360 (@Telugu360) August 22, 2023