నారా లోకేష్ గత ఏడాది యువగలం పేరిట 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ యాత్రను రేపటి నుంచి మళ్లీ ప్రారంభించనున్నారు. రేపు ఒంగోలు, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు మీదుగా జరిగే యాత్ర మే 6న ఏలూరులో ముగుస్తుంది. రోజు సాయంత్రం 4:00 నుంచి 6:00 వరకు యువతతో లోకేష్ ముచ్చటిస్తారని టిడిపి వర్గాలు తెలిపాయి.
కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి మేనిఫెస్టోను ఎన్డీఏ కూటమి రేపు విడుదల చేయనుంది. వైసీపీ మెనీఫెస్టో ఇప్పటికే విడుదలైంది. టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం పేర్లతో చూచాయగా తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ప్రధానంగా పెన్షన్ పై కూటమి దృష్టి పెడుతున్నట్లు సమాచారం. క్రమంగా పెన్షన్ ను పెంచుకుంటూ వెళ్తామని వైసీపీ అంటుండగా….తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ. 4వేల పెన్షన్ ఇస్తామని కూటమి హామీ ఇస్తోంది.