కర్ణాటక సెక్స్ స్కాండల్.. ప్రజ్వల్ రేవణ్ణ దేశాన్ని విడిచి ఎలా వెళ్లగలిగాడు?: కేటీఆర్ ట్వీట్‌

-

సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న విదేశాలకు పారిపోవడంపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ప్రజ్వల్ విదేశాలకు పారిపోవడంలో కేంద్ర ప్రభుత్వ సహకారం లేనట్లైతే అతణ్ని వెంటనే స్వదేశానికి తీసుకొచ్చి చట్ట పరంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రేవణ్న వ్యవహారంపై తాజాగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న తనను వార్త తీవ్రంగా కలచివేసిందని కేటీఆర్ అన్నారు. అతడు దేశాన్ని విడిచివెళ్లేందుకు ఎలా అనుమంతించారని ప్రశ్నించారు. స్వదేశానికి తీసుకొచ్చి రేవణ్నపై చట్టపరమైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మణిపుర్లో మహిళలపై వేధింపులు, బిల్కిస్ బానో కేసులో రేపిస్టుల విడుదల, బ్రిజ్ భూషణ్ సింగ్ పై రెజర్ల ఆరోపణలను పట్టించుకోకపోవడంతో పాటు ప్రస్తుతం ఈ వ్యవహారంపైనా కేంద్రం పూర్తిగా కళ్లు మూసుకుందని కేటీఆర్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version