కుప్పం నియోజకవర్గాన్ని మోడల్ గా తయారు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా నారావారిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తిరుపతి జిల్లా మొత్తం పారిశ్రామికీకరణ చేశామని తెలిపారు.
సంక్షేమ పథకాల్లో మోసం జరగకుండా టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు. వరి, చెరకు వంటి వాటిలో 2 శాతమే ఆదాయం వస్తుంది. కానీ డైరీలో 18 శాతం ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రపంచం మొత్తం ప్రకృతి సేద్యం వైపే చూస్తోందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. పండ్ల తోటలు, పూల తోటల పెంపకం జరిగిందని తెలిపారు. వ్యవసాయంలో డ్రోన్లను విరివిగా ఉపయోగించాలని తెలిపారు. చిన్నప్పుడు చూసిన ఊరికి, ఇప్పటికీ చాలా తేడా ఉంది. మనం కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. ఇంకా కావాలని తెలిపారు.