మచిలీపట్నంలో కొత్త పంచాయితీ..టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు !

-

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. మచిలీపట్నంలో బ్యానర్ విషయంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. బ్యానర్ గొడవ టీడీపీ, జనసేన వర్గాల మధ్య తారస్థాయికి చేరాయి. జనసేన కార్యకర్త యర్రంశెట్టి నాని మరియు అతని బావపై దాడి చేశారు. ఈ దాడిలో శాయన శ్రీనివాసరావు గాయపడ్డారు. నాయర్ బడ్డి సెంటర్ బాలాజీ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న శ్రీనివాసరావు, యర్రంశెట్టి నానిపై మద్యం బాటిళ్లు గ్రైండర్ తో కొట్టారు.

New Panchayat in Machilipatnam Differences between TDP and Janasena factions

ఈ సంఘటనలో శ్రీనివాసరావు తీవ్ర గాయాలు అయ్యాయి. అపార్ట్మెంట్ లోని రెండు ఎల్ సి డి టివిలు, ఫ్రిజ్, గ్రైండర్, ఫర్నిచర్ ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా కొట్టిన అనంతరం ఇద్దరితో కాళ్ళు పట్టించి వీడియోలు చిత్రీకరించారని స్థానికుల ద్వారా సమాచారం అందుతోంది. ఇక తీవ్రంగా గాయపడిన సాయన శ్రీనివాసరావు ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చిలకలపూడి పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version