ఆ బ్యాంకు నుంచి సూపర్ స్కీమ్.. నెలకు రూ.11 వేలు పెన్షన్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం వివిధ రకాల పొదుపు డిపాజిట్ స్కీమ్స్ ని ఇస్తోంది. కస్టమర్లు అవసరాలకు తగినట్లుగా ఈ పథకాలని అందిస్తోంది. పెన్షన్ రూపంలో స్థిరమైన రాబడి కోరుకున్నట్లైతే స్టేట్ బ్యాంక్ ఇస్తున్న డిపాజిట్ స్కీం బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.. పదవీ విరమణ చేసిన వారికి ఎంతో ప్రయోజనకరం ఇది. ఈ పథకం ద్వారా కస్టమర్లకి మంచి వడ్డీ రేటును ప్రభుత్వం అందిస్తోంది. మామూలు కస్టమర్లకు ఏడు శాతం సీనియర్ సిటిజన్లకు అయితే 7.5% వడ్డీని అందిస్తోంది.

పదేళ్లపాటు నెల నెల స్థిరమైన రాబడిని పొందవచ్చు. ఈ పథకంలో ఎవరైనా చేరాలని అనుకుంటే ఇదే మంచి అవకాశం. మూడేళ్ల నుంచి 10 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ని ఎంచుకోవచ్చు. ఇందులో డిపాజిట్ చేసే డబ్బులు, ఎంచుకునే మెచ్యూరిటీ టెన్యూర్ పై ఆధారంగా నెల నెలా డబ్బులు వస్తాయి. ఇందులో 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు 120 నెలలు టెన్యూర్ పెట్టుకోవచ్చు. యాన్యుటీ ప్లాన్ లో మీరు డిపాజిట్ చేసినట్లయితే కనీసం 1000 నుంచి గరిష్టంగా మీరు పెన్షన్ పొందవచ్చు.

ఇదంతా మీ పెట్టుబడి పై ఆధారపడి ఉంటుంది. ఒకేసారి లంప్ సం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా మీకు ఉంటుంది. పెట్టుబడి పై 75% వరకు ఓవర్ డ్రాఫ్ట్ పొందవచ్చు. 10 లక్షల డిపాజిట్ చేస్తే నెలకు 11,870 పెన్షన్ వస్తుంది. తొలి నెల వడ్డీ 6250 అసలు నుంచి 5620 కలిపి చెల్లిస్తుంది. బ్యాంకు టెన్యూర్ పూర్తయ్యేసరికి మీ పెట్టుబడి జీరోకి వస్తుంది. అప్పటిదాకా మీకు వడ్డీతో పాటు అసలు కొంత కలుపుతూ బ్యాంకు చెల్లిస్తుంది పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version