పంట కొట్టుకుపోతే పట్టించుకునే నాధుడే లేడు – నారా లోకేష్

-

రాష్ట్రంలో అకాల వర్షాలకు ఏరు వచ్చి పంట కొట్టుకుపోతే పట్టించుకునే నాధుడే లేడని బండి పడ్డారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ప్రకృతి కన్నెర్ర జేసింది… ప్రభుత్వ పెద్దలు పత్తాలేరు! అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. పాదయాత్ర దారిలో ఏరైతును కదిలించినా కష్టాలు, కన్నీళ్లే సమాధానంగా వస్తున్నాయన్నారు. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు ఘోరంగా దెబ్బతింటే పట్టించుకునే నాధుడే కరువయ్యాడని.. పాదయాత్ర దారిలో కడిమెట్ల శివారులో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను పరిశీలించి, రైతును పరామర్శించానన్నారు.

ఆ రైతు రెండెకరాల మొక్కజొన్న వేస్తే పెట్టుబడి రూ.50వేలు, కౌలు రూ.40వేలు కలిపి రూ.90వేలు పెట్టుబడి అయితే, ఇప్పటిదాకా రూ.9వేలు దిగుబడి వచ్చిందని తన గోడును వెల్లబోసుకున్నాడని తెలిపారు. అకాల వర్షాలకు ఏరువచ్చి పంట కొట్టుకుపోతే పట్టించుకునే నాథుడు లేడని.. అన్నదాతల వద్దకు వచ్చి కనీసం స్వాంతన చేకూర్చలేని ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డీ?! అని నిలదీశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version