ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి నోటీసులు జారీ.. వారంలో ఖాళీ చేయాల్సిందే !

-

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కుటుంబానికి షాక్‌ తగిలింది. ధర్మవరం చెరువు కబ్జా కేసులో నోటీసులు జారీ అయ్యాయని అంటున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడు భార్య వసుమతికి నీటిపారుదల శాఖ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది. చెరువు స్థలం వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారట.

Notice issued to former Dharmavaram MLA Kethi Reddy

ఏడు రోజుల్లో ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. భూమి కబ్జా గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం హిమాలయాల టూర్ లో ఉన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి…దీనిపై స్పందించారు. చెరువు కబ్జా నోటీసులపై ఫేస్ బుక్ ల్తెవ్ ద్వారా స్పందించిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రిమిరెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. నా నోటీసుల వెనుక కచ్చితంగా రాజకీయ కోణం ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version