ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు కంకిపాడు మండలం గండువర్రులో పంచాయతీ రాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్య పాలెంలో రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాలను పరిశీలిస్తారు. అదేవిధంగా పంచాయతీ రాజ్, వాటర్ వర్క్స్ అధికారులతో సమస్యల గురించి చర్చిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
రెండు రోజుల కిందటే ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతం అయిన మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మౌళిక వసతులు లేక అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను ఎన్నికల ప్రచార సమయంలో పరిశీలించిన ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. సమస్యలను పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఆయన గిరిజన గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. జోరు వానలో సైతం పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగడం విశేషం.