నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి 41 సి.ఆర్.పి.సి. సెక్ష న్ కింద నోటీసులు అందాయి. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి మూడు లక్షలు డిమాండ్ చేశారని విలేకరుల సమావేశంలో వెల్లడించారు పెంచలయ్య అనే వ్యక్తి. ఈ సమావేశాన్ని ఫార్వర్డ్ చేయడంతో గోవర్ధన్ రెడ్డి పై కేసు నమోదు చేశారు వెంకటాచలం పోలీసులు.
తాడేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మరో కేసు నమోదు చేసిన పోలీసులు…మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి 41 CRPC సెక్ష న్ కింద నోటీసులు ఇచ్చారు. ఈ రెండు కేసుల్లో ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. రెండు కేసులనూ క్వాష్ చేయాలని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మరి దీనిపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.