ప్రపచనకర్త చాగంటికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి!

-

ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు కీలక పదవి అప్పగించింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆయనతో పాటు మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా మహ్మద్ షరీశ్‌ను నియమించింది.

ఇక శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్‌గా కుడిపుడి సత్తిబాబు, కళింగ చైర్మన్‌గా రోణంకి కృష్ణం నాయుడు, కొప్పుల వెలమ చైర్మన్‌గా పీవీజీ కుమార్, తూర్పు కాపు చైర్మన్‌గా యశ్వస్వి, కురుబ కురుమ చైర్మన్‌గా – దేవేంద్రప్ప, రజక సంఘ చైర్మన్‌గా- సావిత్రి, వాల్మీకి -కప్పట్రాళ్ల సుశీలమ్మ, గవర చైర్మన్‌గా మల్ల సురేంద్రను నియమించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version