చిరుతను పట్టుకునేందుకు కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లా.. రాజమండ్రి దివాన్ చెరువు ప్రాంతంలో చిరుత సంచారం 8 రోజుల నుండి కంటి మీద కునుకులేకుండా చేస్తుంది. హౌసింగ్ బోర్డ్ ప్రాంతం నుండి పుష్కర వనం వైపుగా సంచరిస్తుందని సమాచారంతో అలెర్ట్ అయ్యారు అధికారులు. చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులు సవాల్ గా మారడం తో ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో సెర్చ్ చేస్తున్నారు.
అయితే జాతీయ రహదారి పై అటు ఇటు దాటుతోందనే సమాచారం తో స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేసారు అధికారులు. ఇక చిరుత సంచార భయంతోనే వ్యాపారాలు సాగిస్తున్నారు చిరు వ్యాపారస్తులు. కర్రలు సహాయంతో భయం గుప్పెట్లో వ్యాపారం సాగిస్తున్నంటున్నారు సీతాఫల రైతులు. అయితే రోజు రాత్రి పది గంటలు వరకు సాగే మా వ్యాపారం పొద్దు పోకముందే ముగించుకుని ఇంటికి వెళుతున్నామంటూ చిరు వ్యాపారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క చిరుతను పట్టుకునేందుకు అన్ని సిద్ధం చేసామంటున్నారు అటవీ అధికారులు.