తిరుపతి ఇంజనీరింగ్‌ కాలేజీలో అన్యమత క్లాసులు..ఆడియో లీక్‌ !

-

తిరుపతి ఇంజనీరింగ్‌ కాలేజీలో అన్యమత క్లాసులు చెబుతున్నారట. దీనికి సంబంధించిన ఈ సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది. తిరుపతి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ హెడ్ చెంగయ్య క్లాసులో అన్యమత ప్రచారం చేస్తూ విద్యార్థులను బెదిరిస్తున్నాడని ఆడియో లీక్ చేశారు. ఈ తరుణంలోనే… విసీ కి ఫిర్యాదు చేసి… తర్వాత డిపార్ట్మెంట్ లోకి వెళ్లారు బజరంగ్ దళ్ కార్యకర్తలు.

Pagan classes in Tirupati Engineering College

ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ హెడ్ చెంగయ్య ను నిలదీశారట బజరంగ్ దళ్ కార్యకర్తలు. అయితే…తాను ప్రచారం చేసింది వారిని సన్మార్గ విద్యార్థులను సన్మార్గంలోకి నడపడానికి అంటూ వితండవాదం చేశారట చెంగయ్య. దీంతో చెంగయ్యను బయటికి లాగేసి..పరువుతీశాయట విద్యార్థి సంఘాలు. టీటీడీకి ఎస్వీ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు… నేను ఎలాంటి మత ప్రచారమైన చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చారట చెంగయ్య. దీంతో చెంగయ్య మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి విద్యార్థి సంఘాలు. ఇక దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version