పరిటాల, ఎన్టీఆర్ విగ్రహాల్ని తొలగించడాన్ని ఖండిస్తున్నాం : పరిటాల శ్రీరామ్

-

గుంటూరు జిల్లా వినుకొండ లో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు , మాజీ మంత్రి పరిటాల రవీంద్ర విగ్రహాలను పోలీసుల సహాయంతో, 144 సెక్షన్ పెట్టి మరీ అర్ధరాత్రి తొలగించడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ యువనేత, రవీంద్ర కుమారుడు శ్రీ రామ్ పేర్కొన్నారు. అయితే పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలు మేరకే విగ్రహాలు తొలగించామని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి అధికారాన్ని ఇచ్చింది ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగడానికి, దివంగత నేతల విగ్రహాలను కూల్చేయడానికి కాదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికని శ్రీ రామ్ హితవు పలికారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమం కోసం పని చేస్తే బాగుంటుందని ఆయన కోరారు. ఇక ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల తొలగింపుకు నిరసనగా జిల్లా టిడిపి అధ్యక్షుడు జి. వి.ఆంజనేయులు దీక్షకు దిగారు. తన నివాసం లోనే టిడిపి నేతలతో కలసి దీక్ష చేపట్టారు జి.వి. విగ్రహాల తొలగింపు నేపధ్యంలో పట్టణంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు, ముందస్తుగా జిల్లా టిడిపి అధ్యక్షుడు జి. వి. ఆంజనేయులు ను హౌస్ అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version