ఏపీని పాలించేది సన్నాసులు, దరిద్రులు, హంతకులు అంటూ రెచ్చిపోయారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. నిన్న ఉప్పాడ సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….. పవన్ కళ్యాణ్ భగవంతుడుకే భయపడతాడని… పిఠాపురం లో రోజుకి 2 కోట్ల విలువ మట్టి వెళ్ళిపోతుందని ఫైర్ అయ్యారు.
కాకినాడ ఎమ్మెల్యే అనుచరులు తీసుకుని వెళ్లిపోతున్నారని.. వాళ్ళ పని కాకినాడ వెళ్ళాక చెప్తానని పేర్కొన్నారు పవన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుక కాంట్రాక్టు ల నుంచి 10 వేలు కోట్లు సంపాదిస్తున్నాడని… సీఎం జగన్ నోట్లో వేలు పెడితే కొరకలేడని ఎద్దేవా చేశారు. నేర చరిత్ర ఉన్న వాళ్ళు గద్దె ఎక్కడానికి నేను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. మన కులపోడు అని కాదు.. సరైనోడా కాదా అని చూడండన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.