లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వారణాసి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజునే ఆయన వారణాసికి చేరుకున్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని మోదీ భారీ మెజార్టీతో గెలిచారు. 2014లో ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై 3 లక్షల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
2019లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్ పై 4 లక్షల 70 వేల పై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు. అయితే..ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే వారణాసి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఎన్డీఏ మిత్రపక్షాల ప్రతినిధుల సమక్షంలో నామినేషన్ వేయనున్నారు ప్రధాని మోడీ.