పోలింగ్ పూర్తైన నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్

-

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కొన్నాళ్లకే వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కఠిన సవాల్‌ను విసిరాయి. నేతల వలసలు కూడా గులాబీ పార్టీకి ఇబ్బంది కారణంగా మారాయి. మారిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్… ప్రచార పంథాను మార్చి బస్సుయాత్ర చేపట్టారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ గొంతుకగా బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని కోరారు. ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయింది. పోలింగ్ శాతంపైన గులాబీ నేతలు సంతృప్తిగా ఉన్నారు. ఓటింగ్ శాతం చూస్తుంటే తమకు పెద్ద ఎత్తున సీట్లు కట్టబెట్టేలా కనిపిస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పోలింగ్ ప్రశాంతంగా పూర్తైన నేపథ్యంలో కార్యకర్తలను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు విజయవంతగా ముగియడంతో తమ పార్టీ గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ధైర్యంగా పనిచేసిన పార్టీ నేతలు, క్షేత్రస్థాయి వీరసైనికులకు కేటీఆర్‌ ఎక్స్ వేధికగా ధన్యవాదాలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version