నా రెండో కొడుకుని కూడా ఎత్తుకోలేకపోతున్నా.. అంత బలహీన పడిపోయా అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… నేను మార్షల్ ఆర్ట్స్ చేసే అప్పుడు ముగ్గురు పిల్లలను ఎత్తుకునే వాడిని ఇప్పుడు కనీసం నా రెండో కొడుకుని కూడా ఎత్తుకోలేకపోతున్నా.. అంత బలహీన పడిపోయా అన్నారు.
కొందరు నాయకులు తెలంగాణ ఇవ్వక పోయినా, ఆంధ్ర ఇవ్వక పోయినా భారత దేశం నుండి విడి పోతామని అన్నారని తెలిపారు. అలా ఎలా మాట్లాడుతారు అసలు.. ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశం ఏమైనా కేకు ముక్కనా? అంటూ ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టాలంటే నాన్న సీఎం అవ్వాలా? బాబాయి ని చంపించాలా? సినిమా నాకు ఉప కరణం మాత్రమే..జీవితం కాదన్నారు. పవన్ ఎలా పడితే అలా రాజకీయాలు మార్చాడని తెలిపారు.