తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగనున్నాయి. తెలంగాణలో నేటి నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దీంతో నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉక్కపోత వాతావరణం ఉండేది.
నేడు 8 జిల్లాల్లో దాదాపు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. హైదరాబాద్ లో 40 డిగ్రీలకు చేరువవుతున్నాయి ఉష్ణోగ్రతలు. అవసరం ఉంటేనే బయటకు రావాలని ఐఎండీ సూచనలు చేస్తున్నారు అధికారులు.