పవన్ కళ్యాణ్ – చంద్రబాబు రాజకీయంగా ఆత్మహత్య దిశగా పయనిస్తున్నారు: సీపీఐ నారాయణ

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సోమవారం తిరుపతిలోని పద్మావతి పురంలో ఏబీ బర్దన్ కమ్యూనిటీ భవన్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ – చంద్రబాబుకి తాము సపోర్ట్ చేయబోమని అన్నారు.

సీఎం జగన్ కూడా బిజెపితోనే ఉన్నారని.. కేంద్రం ఏ బిల్లు పెట్టినా ఆ పార్టీ నే ముందు ఓటు వేస్తుందని అన్నారు. పోలవరం, రాయలసీమ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా బిజెపి రాష్ట్రానికి అన్యాయం చేసిందని విమర్శించారు. బిజెపి కుట్రపూరితంగా మణిపూర్ ను మండిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ దేశంలో అరాచకాలను సృష్టిస్తుందన్నారు నారాయణ. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే మా మద్దతు ఎవరికి అనేది ప్రకటిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version