రామోజీరావు మృతి నేపథ్యంలో…పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాదుకు బయలుదేరిన పవన్ కళ్యాణ్….ఢిల్లీలోని తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. హైదరాబాదుకు చేరుకుని రామోజీరావు పార్దివ దేహానికి నివాళులర్పించనున్నారు పవన్. ఇక అంతకు ముందుకు రామోజీ మృతి పట్ల పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీ రావు…. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని రామోజీ నిరూపించారన్నారు.
అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని భావించాను….రామోజీ రావు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది….రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని వెల్లడించారు. రామోజీరావు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమేనని… రామోజీ ఎప్పుడూ ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారని చెప్పారు.
వర్తమాన రాజకీయాలపై, పాలన తీరుతెన్నులపై నిష్కర్షగా వార్తలను అందించారు….ప్రజా ఉద్యమాలకు రామోజీ వెన్నుదన్నుగా నిలిచారన్నారు. పత్రికాధిపతిగానే కాకుండా సినీ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకులుగా, వ్యాపారవేత్తగా బహుముఖ విజయాలు సాధించారు….రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ ను వేదికగా చేశారని వెల్లడించారు.