Pawan Kalyan Demands Dokka Seethamma Canteens: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఏపీలో అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయన్నారు. విలువలు ఉన్న మనిషి డొక్కా సీతమ్మ అని.. అందుకే ఆమెకు గుర్తుగా ఏపీలో అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయన్నారు.
ప్రతిపక్షం లేదని అనుకోవద్దు సమస్య వచ్చినప్పుడు మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటవీశాఖలో 425 పోస్టులు ఖాళీగా ఉన్నాయని..ఫారెస్ట్ చెక్ పోస్టుల్లో నిఘా కొరవడిందని అన్నారు. ఆంధ్రా నుంచి అక్రమంగా రవాణా చేసిన ఎర్రచందనం దుంగలను నేపాల్ లో పట్టుకున్నారని , ఈ ఫైల్ తన దగ్గరకు వచ్చినట్లు తెలిపారు. బియ్యం అక్రమ రవాణాను అడ్ఢుకోమని మంత్రి మనోహర్ కు చెప్పినట్లు వెల్లడించారు.