జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అంబేద్కర్ కోనసీమ రామచంద్రపురం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ముందు దేశం అన్నాడని, ఆ తర్వాత రాష్ట్రం అన్నాడని, ఇక ఇప్పుడు గోదావరి జిల్లాలకు పరిమితం అంటున్నాడని ఎద్దేవా చేశారు. అసలు కుల ప్రస్తావన లేకుండా మాట్లాడలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ దుయ్యబట్టారు. మీ సామాజిక వర్గం ఓట్లు ఉన్నచోట తిరగమని చంద్రబాబు చెప్పాడా..? అని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు ట్రాప్ లో పడ్డాడని.. అసలు పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు. ఇక టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ది ఓ ఫెయిల్యూర్ పాదయాత్ర అని.. ఆయన పూర్తి అసహనంతో ఉన్నాడని అన్నారు. ఎవరెన్ని చేసినా రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని మరోసారి స్పష్టం చేశారు మంత్రి చెల్లుబోయిన.