సీఎం జగన్ కి పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సామాజిక పింఛన్లు తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న తీరు గురించి లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా మరియాపుట్టి మండలంలో కొందరు వృద్ధులకు పింఛన్లు రద్దు నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరి పేరునా వేల ఎకరాల భూములు ఉన్నాయని కారణం చూపారని.. ఆ వృద్ధులకు ఆ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

అదేవిధంగా పెనుగొండ ప్రాంతంలో రజక వృత్తిపై ఆధారపడిన శ్రీమతి రామక్క అనే పించనుదారుకి 158 ఇల్లు ఉన్నాయని నోటీసులో చూపారని.. నిజంగా అన్ని ఇల్లు రామక్క గారికి ఉంటే అవి ఎక్కడ ఉన్నాయో చూపించి ఆ ఇళ్ల తాళాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం అంతటి ఆస్తిపరులే అయితే పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూనో, మీ వాలంటీర్ల చుట్టూ ఎందుకు తిరుగుతారు? అని ప్రశ్నించారు. విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం పెరిగిందనో పింఛన్లు రద్దు చేయాలని చూడడం విచిత్రంగా ఉందని లేఖలో పేర్కొన్నారు జనసేనాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version