పవన్ కల్యాణ్.. జనసేనను మరింత బలపరచాలని నిర్ణయించుకున్నారంట. కార్యకర్తలను గ్రూపులుగా విభజించి మరీ మీటింగులు పెట్టాలని ఫిక్సయ్యారంట. అందులో భాగంగా ఫ్రీ సభ్యులు ఒక లిస్టు, డబ్బులు కట్టి సభ్యులయ్యేవారిది మరో లిస్టు నియోజకవర్గాల వారీగా తయారుచేయించాలని ఫిక్సయ్యారంట!
అవును… పార్టీ సభ్యులందు క్రియాశీల సభ్యులు వేరయా అంటూ కొత్త పల్లవందుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! అందులో భాంగంగా డబ్బులిస్తేనే పార్టీ సభ్యత్వం ఇస్తారు.. అది కూడా అలాంటిలాంటి సభ్యత్వం కాదు.. దానిపేరు వేరు. అదే క్రియాశీలక సభ్యత్వం! ఈ సభ్యత్వం తీసుకోవాలనుకునేవారు 500 రూపాయలు చెల్లించి సభ్యులుగా చేరొచ్చు. నియోజకవర్గాల వారీగా జరిగే పార్టీ సమావేశాలకు వీరిని పిలుస్తారు.
అందులో భాంగంగా ముందుగా రాజోలు, ఇచ్చాపురం, నెల్లూరు రూరల్, మంగళగిరి, అనంతపురం నియోజకవర్గాల్లో ఈ వీఐపీ సభ్యత్వాల నమోదు మొదలైంది! ఇది కూడా ఎక్కువమంది కాదు సుమా… ఒక్కో నియోజకవర్గానికి 500 మంది మాత్రమే వీఐపీ సభ్యులుగా ఉంటారు. అంటే… ఆలసించినా ఆశాభంగం అన్న మాట! ఈ లెక్కన చూసుకుంటే… ప్రతీ నియోజకవర్గానికి అక్షరాలా 2 లక్షల 50వేల రూపాయల చొప్పున పార్టీ ఖాతాలో జమవ్వనుందన్నమాట!!
ఈ లెక్కన చూసుకుంటే… 175 నియోజకవర్గాలకు గాను పవన్ వసూలు చేయాలనుకుంటున్న మొత్తం అక్షరాలా 4 కోట్ల 37లక్షల 50వేల రూపాయలు. అంటే ఇకపై జనసేన కార్యకర్తను అని ఎవరైనా అంటే సరిపోదు. అందులో ఎలాంటి కార్యకర్తో కూడా చెప్పాలి! సాధారణ సభ్యుడా.. వీఐపీ సభ్యుడా.. క్రియాశీల సభ్యుడా… అబ్బో ఇది మామూలు వ్యవహారం కాదబ్బా!! పవన్ ఇప్పటివరకూ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల్లో మరో వ్యూహాత్మక నిర్ణయంగా ఇది మిగిలిపోబోతుందో లేదో వేచి చూడాలి!
-CH Raja