నేను ఊపిరి తీసుకోవడం ఆపేయాలా ? – వైసీపీపై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన ట్వీట్ చేశారు. నేను ఊపిరి తీసుకోవాలా ? వద్దా ? అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్.తన వారాహి వాహనంపై వైసీపీ చేస్తున్న విమర్శలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

తాను కనీసం ఈ చొక్కా వేసుకోవచ్చా? అని ప్రశ్నించిన పవన్, ‘తోలుత నా సినిమాలు ఆపేశారు. విశాఖలో వాహనం, హోటల్ నుంచి బయటకు రానీయలేదు. నగరం నుంచి వెళ్ళిపోవాలని బలవంతం చేశారు. మంగళగిరిలోను కారు నుంచి బయటకు రానీయలేదు. ఇప్పుడు వాహనం రంగు సమస్యగా మారింది. సరే నేను ఊపిరి పీల్చుకోవడం ఆపేయాలా? తర్వాత,’ అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version