శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే గోవింద యాప్‌ అందుబాటులోకి

-

శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడి భక్తుల సౌలభ్యం కోసం మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది టీటీడీ. ఇకపై తిరుమలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని యాప్‌ ద్వారా అందించేందుకు టీటీడీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.. శ్రీవారి దర్శన టికెట్లు, సేవలు, వసతి గృహాలను బుక్‌ చేయడంతో సమాచారమంతా భక్తులకు అందుబాటులో ఉంచేలా ఈ యాప్‌ను రూపొందించే పనిలో ఉంది ఐటీ విభాగం. ఇప్పటికే యాప్‌‌ దాదాపు పూర్తికాగా.. త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో గోవింద యాప్‌ను తీసుకొచ్చారు టీటీడీ అధికారులు.

కానీ ఆ యాప్‌తో కొన్ని ఇబ్బందులు వచ్చాయి.. భక్తులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడలేదు. తాజాగా ఈ స్థానంలో కొత్త యాప్‌ తీసుకురాబోతోంది టీటీడీ. దర్శన టోకెన్లకు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో టీటీడీకి సంబంధించిన వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకుంటున్నారు. కొత్తగా తీసుకొచ్చే యాప్‌ ద్వారా భక్తులు సులభంగా దర్శనం, గదులు, శ్రీవారిసేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే సేవలు జరిగే సమయంలో సుప్రభాతం, తోమాల, అర్చన వంటి వాటిని వినేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు టీటీడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version