అస్ట్రేలియా ఇండియా జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాల్గవ టెస్టు లో కష్టాల్లో ఉన్న జట్టును తన అధ్భుత సెంచరీతో ఆదుకున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పై సర్వత్రా ప్రశంసలు
కురుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా నితీష్ కుమార్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
నితీశ్ కుమార్ రెడ్డి తెలుగువాడైనందుకు గర్వంగా ఉందని చాలా మంది పోస్టులు పెడుతుంటే ఏపీ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. “నువ్వు ‘భారత్’ లోని ఏ ప్రాంతం నుంచి వచ్చారనే దానికంటే దేశం గర్వించేలా ఏం చేశావన్నదే ముఖ్యం.
యువతకు క్రీడల పట్ల అభిరుచి మరియు దృఢ సంకల్పంతో ఆసక్తిని పెంపొందించేలా స్ఫూర్తినివ్వాలి.
ఇలాంటి వరల్డ్ క్లాస్ రికార్డులెన్నో సాధించాలని కోరుకుంటున్నా. భారత జెండాను ఉన్నత స్థాయికి
తీసుకెళ్లి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలి” అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్
కళ్యాణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.