అవతలి వాళ్ళకు ఇబ్బంది కలిగించకుండా “నో..” చెప్పాలంటే ఇలా చేయండి

-

ఈ కాలంలో నో చెప్పడం నేర్చుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అవతలి వాళ్లకు కాదని చెప్పడం నేర్చుకోవాలి. మొహమాటానికి పోయి, అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించి.. నువ్వు చెప్పకుండా ఉంటే మీ సమయం వృధా అవటమే కాకుండా మీరు వాళ్ళ దృష్టిలో చీప్ అయిపోతారు.

అయితే నో చెబితే అవతలి వాళ్ళు హర్ట్ అవుతారని ఫీల్ అవుతుంటారు. వాళ్లు హర్ట్ కాకుండా నో ఎలా చెప్పాలో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రత్యామ్నాయం కనుక్కోండి:

ఉదాహరణకు మిమ్మల్ని ఎవరైనా తోడుగా రమ్మని పిలిచారు. లేదంటే డబ్బులు ఇవ్వమని అడిగారు. ఇలాంటి సందర్భాల్లో మీకు మరొక పని ఉందని సావధానంగా తెలియజేయండి. అలా చెప్పినప్పుడు అవతలి వాళ్లు అర్థం చేసుకుంటారు.

మీకు ఏది ముఖ్యమో ఆలోచించుకోండి:

ఏదైనా అవతలి వారు అడిగినప్పుడు.. అది మీకు ముఖ్యమా కాదా ఆలోచించుకోండి. నిజంగా ముఖ్యం కాకపోతే.. డైరెక్టుగా నో చెప్పకుండా.. దానివల్ల నాకు యూస్ ఏమీ లేదు అని సున్నితంగా చెప్పండి. మీ గొంతు కరుకుగా కాకుండా మృదువుగా ఉండాలి.

బౌండరీస్ గీసుకోండి:

మీకూ అవతలివారికి బౌండరీస్ తప్పకుండా ఉండాలి. క్లోజ్ నెస్ ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం బౌండరీస్ పాటించాలి. లేకపోతే మీరు అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

నో చెప్పేటప్పుడు మాటలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీ మాటల్లో మృదుత్వం ఉట్టిపడాలి.
ఐ యాం రియల్లీ సారీ, ఐ కాంట్ హెల్ప్ యు రైట్ నౌ అని చెప్పాలి.

కట్టే కొట్టే తెచ్చే లాగా చెబితే అవతలి వాళ్ళు హర్ట్ అవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version