కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదే – పవన్ కళ్యాణ్

-

కోనసీమ క్రాప్ హాలీడే పాపం వైసీపీదేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్‌ అయ్యారు. రైతాంగంపట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే పంట విరామ నిర్ణయం అని.. కోనసీమ రైతులకు అండగా జనసేన ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో ఈ రోజు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి అని పేర్కొన్నారు.

ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించరని..కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదని ఫైర్‌ అయ్యారు.రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వరు.. ఇలాంటి ఇబ్బందులతోనే రైతాంగం పంట వేయకూడదనే నిర్ణయం తీసుకుందని చెప్పారు.

దాదాపు 11 ఏళ్లు తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు దాపురించడం చాలా బాధాకరమని..తొలకరి పంట వేయలేమని కోనసీమ రైతులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారన్నారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పంట విరామ నిర్ణయాన్ని తీసుకున్నారని.. అన్నం పెట్టే రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలైన ఉంటాయని వెల్లడించారు. అలాంటి అన్నదాతలే పంట పండించలేమని తేల్చి చెబుతున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని.. క్రాప్ హాలీడే ప్రకటించడం చాలా అరుదుగా జరుగుతుంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version