తాడేపల్లిగూడెం సభతో అసలు ఏం సందేశం ఇచ్చారని.. జెండా సభకు జనాలు రాకపోవటంతో ఆలస్యంగా మొదలుపెట్టారని ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం రాజమహేంద్రవరంలో మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ జనసేన పొత్తు అట్టర్స్టాప్. తాడేపల్లిగూడెం సభలో ఏం సందేశం ఇచ్చారు?. పవన్ షేరింగ్ గురించి మాట్లాడతారేమోనని అంతా ఎదురుచూశారు. పవర్ స్టార్ అన్నారు కానీ.. పవరే షేరింగ్ గురించి మాట్లాడలేదు. సీఎం జగన్ ను దూషించడం కోసమే జెండా సభ జరిగినట్లుంది.
పవన్ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పోల్ మేనేజ్ మెంట్ చేయలేని జనసేనకు చంద్రబాబు 24 సీట్లు ఇవ్వడం గొప్ప విషయం అన్నట్టు పవన్ మాట్లాడుతున్నారు. వంగవీటి రాధాను చంపినప్పుడు లేని బాధ.. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే వచ్చిందా ? కమ్యూనిస్టులతో స్నేహం చేశావుగా.. మరీ చచ్చేదాకా ఉన్నావా..? పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్.. చంద్రబాబు నాయుడు పవన్ కి రాజకీయంగా మొగుడు జగన్ అని ఫైర్ అయ్యారు.