పెండింగ్ విమానశ్రయాలను రెండేళ్లలో పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఇవాళ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు ప్రసంగించారు. సీఎం, డిప్యూటీ సీఎం తరువాత ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడారు.

అనంతరం ఏపీ అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కలిశారు. ఇరువురు నేతలు అప్యాయంగా ఆలింగనం చేసుకుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న ఎయిర్ ఫోర్టుల పని ఎప్పటిలోగా పూర్తి చేస్తారని రామ్మోహన్ నాయుడుని మంత్రి లోకేశ్ అడగ్గా.. రెండేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి చెప్పారు. రెండేళ్లా.. ఇంకా త్వరగా పూర్తి చేయాలని లోకేశ్ కోరగా ప్రయత్నిస్తామని తెలిపారు. మరోవైపు ఈ నెల 24న ఏపీ కేబినెట్ సమావేశం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక విషయాల గురించి చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version