AP Group-2 Mains Exams: నేడు గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. 175 కేంద్రాల్లో 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ఉ.10 గంటల నుంచి మ.12.30 వరకు పేపర్-1 పరీక్ష జరుగనుంది. మ.3 నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2 ఉంటుంది.
అభ్యర్థులు ఉ.9.30 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది APPSC. కాగా, APPSC సంచలన ఆరోపణలు చేసింది. గ్రూప్ -2 అభ్యర్థుల ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. గ్రూప్-2 నిర్వహణపై ప్రభుత్వం రాసిన లేఖకు సమాధానం ఇచ్చింది APPSC. పరీక్ష సకాలంలో జరగకపోతే నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది… మెయిన్స్ కు క్వాలిఫై కాని కొందరు పరీక్షల వాయిదా కోరుతున్నారు అని ఆరోణలు చేసింది. నోటిఫికేషన్ రద్దు చేస్తే మరోసారి పరీక్ష రాసే ఛాన్స్ పొందాలనుకుంటున్నారని పేర్కొంది APPSC.