బాబును సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ పాకులాడతాడు – పేర్నినాని

-

చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ పాకులాడతాడని అసెంబ్లీ పేర్నినాని ఫైర్‌ అయ్యారు. ఇవాళ అసెంబ్లీలో పేర్ని నాని మాట్లాడుతూ…జగన్ జనంలోకి వెళుతుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని చురకలు అంటించారు. 2014లో ఉమ్మడి పోటీగా ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా?? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళతారు?? అంటూ నిలదీశారు.

perni nani

హామీలు అమలు చేయలేదని మోడీ కూడా చంద్రబాబును ఎందుకు నిలదీయ లేదు?? ఒక్క సీటు ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ను సీఎం చేయటం కోసమే పాకులాడతాడని చురకలు అంటించారు. 2014లో జగన్ కు ఇప్పటికి చాలా తేడా ఉంది….మళ్ళీ అధికారంలోకి వచ్చేది మా ప్రభుత్వమేనన్నారు. చంద్రబాబు కు మతి చెడిందా?? అంటూ ఆగ్రహించారు.

పేర్ని నాని సర్వర్ ఉద్యోగం చేస్తున్నాడు అని చంద్రబాబు అంటున్నాడు…నేను వస్తే సాఫ్ట్ ‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తాను అన్నాడన్నారు. కార్యకర్తలకు భోజనం పెడితే అంత చులకనగా కనిపిస్తున్నామా?? సర్వర్లు మనుషులు కాదా?? చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం అంటూ ఫైర్‌ అయ్యారు పేర్ని నాని.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version