ఇలానే చేస్తే..ఏపీ పోలీసులకు ఉరి వేస్తారు – పేర్ని నాని హెచ్చరికలు !

-

సోషల్ మీడియా కేసులకు కడప పోలీసులు చేసినట్టు వేరో దేశాల్లో అయితే ఉరి వేసి చంపుతారని హెచ్చరించారు మాజీ మంత్రి పేర్ని నాని. తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ బూటు కాలుతో తన్ని, వైఎస్ జగన్ ను అసహ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏపీ పోలీసులు ఇంత దిగ జారి ప్రవర్తించాలా? అరబ్ దేశాల లో ఐతే ఇలాంటి పోలీసులకు ఉరి వేస్తారని హెచ్చరించారు మాజీ మంత్రి పేర్ని నాని.


పోలీసు వ్యవస్థ ను కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందని మండిపడ్డారు. ఖూనీలు చేసే వారిని, దొంగ తనాలు చేసే వారిని కొట్టడమే తప్పు అని చెప్పే ఈ ప్రజాస్వామ్యం లో రాజకీయ కక్ష్య తో పోలీసులు దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 2015 లో పెట్టిన పోస్టులకు ఇప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ లో ఉండే జగన్ అభిమానిని వేధించారన్నారు.

బడ్జెట్ లో ప్రజలకు ఏం ఒరగ పెట్టలేదు…సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించి లేదని చురకలు అంటించారు. నాలుగు నెలల్లో వేల కోట్లు అప్పులు చేశారని ఆగ్రహించారు. టిడిపి నేతలు చేసే పాపలు డీజీపీ కి యజ్ఞాల లా కనిపిస్తున్నాయన్నారు. పోలీసులకు అంత ఇష్టం ఉంటే రాజకీయాల్లోకి రావచ్చని సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version