‘కన్నప్ప’ నుంచి మోహన్ బాబు లుక్ రివీల్

-

టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేస్తామని గతంలోనే మేకర్స్ వెల్లడించారు.

మంచు విష్ణు కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీ అంచనాలు నెలకొన్నాయి.   దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం. కథ, నటీనటుల ఎంపిక మొదలుకొని ప్రతి అంశం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. సినిమాలో కన్నప్పగా మంచు విష్ణు ప్రధాన పాత్రలో కనిపించనుండగా, ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ శివుడి క్యారెక్టర్ చేయనున్నారు. ఇక మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. తాజాగా మోహన్ బాబు నటిస్తున్న మహాదేవ శాస్త్రీ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాత్ర చాలా ఏళ్లు గుర్తుండిపోతుందని మంచు విష్ణు ట్వీట్ చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version