PAC కమిటీ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. PAC చైర్మన్ ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న వారికి ఇవ్వలేదని.. ఆర్టికల్ 309 ప్రకారం ప్రతిపక్ష నాయకుడికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1981, 82 లో బిజెపి కి ఇద్దరే ఉన్నా వారికే PAC చైర్మన్ ఇచ్చారని… ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేక పర్యాయాలు ఇచ్చారని పేర్కొన్నారు. PAC అన్ని తప్పిదాలనూ ఎత్తి చూపుతుంది..పాకిస్థాన్ సహా అన్ని దేశాల్లో PAC ప్రతిపక్షానిదే అంటూ ఆగ్రహించారు.
గతంలో అనేక కుంభకోణాలు వెలుగులోకి తెచ్చింది PAC నేనని… బోఫోర్స్ కుంభకోణం వెలికి తీసింది కూడా PAC నే అంటూ వ్యాఖ్యలు చేశారు. 2G స్పెక్ట్రమ్ కూడా మనోహర్ జోషీ వెలికి తీసారని.. కామన్ వెల్త్ గేమ్స్ లో కుంభకోణాలు కూడా 2010లో PAC వెలికి తీసిందని గుర్తు చేశారు. 1994లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకున్నా గీతారెడ్డికి PAC ఇచ్చారన్నారు. 2019లో మేం PAC చైర్మన్ గా పయ్యావుల కేశవ్ కి ఇచ్చామని గుర్తు చేశారు. అధికారంలో ఉండే వారికి ఇస్తే ఏం న్యాయం జరుగుతుందని..అన్నారు. జగన్ కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వడం లేదని.. PAC కమిటీ ఎన్నికలను బాయ్ కాట్ చేస్తున్నామన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.