పోలవరం ప్రాజెక్టు లో మరో కీలక ఘట్టం పూర్తయింది. పోలవరం ప్రాజెక్టు లో భాగంగా జలాశయాన్ని ఎడమ కాలువతో అనుసంధానం చేసే సొరంగం పూర్తి అయింది. 919 మీటర్ల పొడవు, 18 మీటర్ల వ్యాసం, 20వేల క్యూసెక్కుల సామర్థ్యంతో తవ్వకాల జరిగాయి. టీడీపీ హయాంలో అంచనాలు పెంచి రూ.292.09 కోట్లకు కాంట్రాక్టర్‌కు చంద్రబాబు సర్కార్ కట్టబెట్టినట్లు సమాచారం అందుతోంది.
దాన్నే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు సీఎం జగన్.. రూ.231.47 కోట్లకే అదే కాంట్రాక్టు సంస్థ ముందుకొచ్చింది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ఖజానాకు రూ. 60.62 కోట్లు ఆదా అయినట్లు ఏపీ సర్కార్ పేర్కొంది. తద్వారా చంద్రబాబు కమీషన్ల బాగోతం గుట్టు రట్టు అయినట్లు పేర్కొన్నారు అధికారులు. ఈ మేరకు ఏపీ సర్కార్ అధికారిక ప్రకటన చేసింది. దీని పై ఏపీ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.