ఏపీ మంత్రి స్వగ్రామంలో క్లబ్ పై పోలీస్ రైడ్.. ఊళ్లోకి ఎంటర్ కానివ్వకుండానే !

-

చిప్పగిరి మండలం గుమ్మనూరు లో పేకాట క్లబ్ పై స్పెషల్ పార్టీ పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా భారీగా నగదు, వాహనాలు స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గౌతమిశాలి ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ గుమ్మనూరు మంత్రి గుమ్మనూరు జయరాం స్వగ్రామం అని తెలుస్తోంది. అయితే ఊళ్ళోకి పోలీసులు ఎంటర్ అవుతుండగా దాడి చేసినట్టు తెలుస్తోంది.

అంతే కాక ఆ సమయంలో లోపల ఉన్నవారికి సమాచారం ఇవ్వడంతో వారంతా జారుకున్నారు. ఈ దాడి మీద అడిషనల్ ఎస్పీ గౌతమిశాలి మాట్లాడుతూ అక్కడ పేకాట ఆడుతూ, కర్ణాటక మద్యం సేవిస్తున్నారని తెలిసిందని, ఆ సమాచారంతోనే దాడి చేశామని అన్నారు. పోలీసులు ముందు జాగ్రత్తతో ఆటలలో అక్కడికి వెళ్ళినా అడ్డుకుని దాడులు చేశారని పేర్కొన్నారు. పేకాట స్థావరానికి చేరుకునే లోపే పేకాట రాయుళ్ళు పరారయ్యారని పేర్కొన్నారు. పారిపోతుండగా జారి పడిన ఐదు లక్షలని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. అలానే 42 కార్లు సీజ్ చేసి, 42 మందిని అరెస్ట్ చేశామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version