మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.

కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ప్రసన్నపై కేసు నమోదు ఐంది. ఈ తరుణంలోనే పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. అటు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలో ఉంది నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రక్తం అన్నారు. మాకు భయం అంటే ఏంటో తెలియదు, మేము ఎంత దూరమైనా వెళ్తామని పేర్కొన్నారు. నాకు చేతి నొప్పి వల్ల ఆసుపత్రికి వెళ్లాను, ఎక్కడికీ పారిపోలేదు… ఇప్పుడంటే ఇప్పుడొచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లండి స్పష్టం చేశారు.