YSR పులి లాంటి మనిషి – పూనమ్‌ కౌర్‌

-

YSR పులి లాంటి మనిషి అని టాలీవుడ్‌ బ్యూటీ పూనమ్‌ కౌర్‌ అన్నారు. ఇవాళ వై.య‌స్‌.రాజ‌శేఖ‌ర‌రెడ్డి 74వ జ‌యంతి వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా సెంట్రల్ ఆఫీసులో జయంతి వేడుకలతో పాటు, ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు చేపట్టనుంది వైసీపీ పార్టీ. ఈ కార్యక్రమంలో…. సజ్జల, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు.

అయితే.. ఇవాళ వై.య‌స్‌.రాజ‌శేఖ‌ర‌రెడ్డి 74వ జ‌యంతి వేడుకలు ఉన్న నేపథ్యంలోనే.. టాలీవుడ్‌ బ్యూటీ పూనమ్‌ కౌర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదవాళ్ల ని అడ్డు పెట్టుకుంటూ కేవలం వోట్ ఇంకా నోటు రాజకీయాలు చేస్తూ ఉంటాయ్నారు. పేదవాళ్ల మనసు లో చోటు తెచ్చుకున్న అగ్ర నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు , అనుకోకుండా చినప్పుడు ఈ పులి లాంటి మనిషి ని కలవడం అదృష్టంగా భావిస్తున్నానని పోస్ట్‌ పెట్టారు టాలీవుడ్‌ బ్యూటీ పూనమ్‌ కౌర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version