జనాభాను పెంచాలి అంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్లు చేశారు. జనాభాను పెంచడాన్ని భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. నేటి కాలంలో ఎక్కువమంది పిల్లలను కనడానికి ప్రస్తుతం యువత అస్సలు ఇష్టపడడం లేదు. దానికి గల ప్రధాన కారణం విపరీతంగా ఖర్చులు పెరగడం, దానికి తగినట్టుగా ఆదాయాన్ని లేకపోవడమే ఈ సమస్యకు కారణమని చంద్రబాబు అన్నారు.

ప్రస్తుతం పరిస్థితులలో జనాభా పెరగడం చాలా అవసరమని అన్నారు చెప్పారు. ఇప్పుడు జనాభా ఎక్కువగా ఉన్న దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. జనమే ప్రధాన ఆస్తిగా భావించే రోజులు ఇప్పుడు వచ్చాయి అంటూ ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచన కామెంట్లు చేశారు. యువత ఎక్కువగా పిల్లలను కనాలి జనాభాను పెంచాలి అంటూ ఆయన సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.