పోసాని కృష్ణమురళిని నడిరోడ్డుపై ఉరి తీయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమండ్రి రూరల్ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇవాళ మీడియాతో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. బడ్జెట్ ఈసారి భారీగా ఉందని… ఇదే రికార్డ్ అని వెల్లడించారు. గత ప్రభుత్వ హాయంలో రాష్ట్రం దివాళా తీసిందని ఆగ్రహించారు.

45 వేల కోట్ల రూపాయలు పాత బాకీలు చెల్లింపు చేశామన్నారు.ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. అన్ని రంగాలకు భారీగా నిధులు కేటాయింపులు చేశారు రాజమండ్రి రూరల్ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తిని నడిరోడ్డుపై ఉరి తీయాలని.. పోసాని లాంటి వ్యక్తులకు డబ్బులు ఇచ్చి జగన్ తిట్టించారని ఆగ్రహించారు. అందరిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు రాజమండ్రి రూరల్ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.