ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈనెల 8 నుంచి 10వ తేదీ మధ్య జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) పలు జిల్లాల్లో వాయిదా వేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ రవిప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
వీటిని జనవరి 11 నుంచి 20వ తేదీ మధ్య నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి, శాంతి భద్రతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వాటిని వాయిదా వేసినట్లు రవిప్రకాశ్ తెలిపారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు…నిరాశ చెందుతున్నారు. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.