లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నయని కాంగ్రెస్ మోసం చేయడానికి సిద్ధమైంది : బండి సంజయ్

-

లోకల్ బాడీ ఎలక్షన్స్ తలమీదకు వచ్చినయ్. మార్చిలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగకపోతే 15వ ఆర్దిక సంఘం నుండి రావాల్సిన 2 వేల కోట్ల పైచిలుకు నిధులు ఆగిపోతయ్. అందుకే ఇప్పుడు రైతు భరోసా, రేషన్ కార్డులంటూ కొత్త డ్రామాను తెరపైకి తెచ్చింది అని బండి సంజయ్ అన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజాలారా… కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోకండి. కేసీఆర్ కూడా గతంలో ఇట్లనే డబుల్ బెడ్రూం ఇండ్లు, రేషన్ కార్డులు, ఉద్యోగాలిస్తాననని నిండా ముంచిండు.. కాంగ్రెస్ కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నయని మోసం చేయడానికి సిద్ధమైంది.

70 లక్షల మంది రైతులకు ఏటా ఎకరాకు 10 వేల చొప్పున మొన్నటి వరకు రైతు బంధు పడింది. కాంగ్రెసోళ్లు 15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇస్తే రైతులంతా ఓట్లేసి గెలిపించిర్రు. అధికారంలోకి వచ్చాక ఏడాది పైసలను ఎగ్గొట్టిర్రు. ఇప్పుడేమో ఎకరాకు 12 వేలు మాత్రమే ఇస్తానంటూ కోతలు పెడుతున్నరు. నమ్మి ఓటేస్తే మోసం చేయడం ఎంత వరకు కరెక్ట్? ఈ లెక్కన చూసినా గడిచిన ఏడాది బకాయి. రాబోయే రబీ సీజన్ పైసలు కలిపితే ఎకరాకు 18 వేల చొప్పున రైతుకు బకాయి ఉన్నరు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలందరికీ ఇస్తమన్నరు. ఈ లెక్కన రైతులందరికీ 12 వేల 600 కోట్లు ఇయ్యాలే. జనవరి 26న ఆ మొత్తాన్ని రైతులకు చెల్లిస్తరా? లేదా? స్పష్టం చేయాలే. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందలే. అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ స్తామని సన్నబియ్యానికే పరిమితం చేశారు. అది కూడా 5 శాతం మంది రైతులకే బోనస్ ఇచ్చి చేతులు దులుపుకున్నరు అని పేర్కొనను బండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version