పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌…ఇండిపెండెంట్‌ గా పోటీ చేయనున్న పోతిన మహేష్ ?

-

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇండిపెండెంట్‌ గా పోటీ చేయనున్నారట పోతిన మహేష్. బెజవాడ పశ్చిమలో రాజకీయాలు వేడెక్కాయి. ఇవాళ తన కార్యకర్తలతో జనసేన పశ్చిమ ఇంఛార్జి పోతిన మహేష్ సమావేశం నిర్వహించారు. పొత్తులో పశ్చిమ టికెట్ జనసేనకు కాకుండా బీజేపీకి కేటాయించారు. దీంతో చివరి వరకు టికెట్ కోసం ఆందోళనలు చేసింది జన సేన పార్టీ.

Pothina Mahesh will contest as an independent

అయినప్పటికీ టికెట్ దక్కక పోవడంతో అసంతృప్తితో ఉన్నారు పోతిన మహేష్. ఈ తరుణంలోనే… ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని జనసేన పశ్చిమ ఇంఛార్జి పోతిన మహేష్ ను కోరుతున్నారు కార్యకర్తలు. ఇప్పటికే పవన్, నాదెండ్ల ను కలిసారు పోతిన మహేష్. కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానని చెబుతానని వెల్లడించారు జనసేన పశ్చిమ ఇంఛార్జి పోతిన మహేష్. దీంతో పోతిన మహేష్ ఇండిపెండెంట్‌ గా పోటీ చేయనున్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version