నల్గొండ లో గెలిచి చరిత్ర సృష్టిస్తా.. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి

-

నల్గొండ ఎంపీ అభ్యర్థిగా గెలిచి చరిత్ర సృష్టిస్తానని బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ను ప్రజలు నమ్మడం లేదని.. బీజేపీ.. కాంగ్రెస్ కి ఎప్పుడూ బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. జిల్లా బీజేపీలో అందరినీ కలుపుకొని పోయి పని చేస్తానని.. తప్పకుండా జిల్లాలో బీజేపీ జెండా ఎగురవేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు.

100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పని తీరు ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి.. ఇప్పుడు చేతులు ఎత్తేశారని విమర్శించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తాచాటుతుందని పేర్కొన్నారు. గతానికి భిన్నంగా మెజార్టీ సీట్లు కైవసం చేసుకోబోతుందని చెప్పారు. ప్రజలు నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులయ్యారని.. మోడీ మరోసారి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version