ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఈరోజు విజయనగరం జిల్లా గజపతినగరంలో పర్యటించనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్లను పరిశీలించనున్నారు. ‘గుంతల రహిత రోడ్ల నిర్మాణం’ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. జనవరి 15 నాటికి రూ. 869 కోట్లతో రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లకు మరమ్మతులు చేయడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్లకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను తీసేయడంతోపాటు కల్వర్టుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
ఇందుకోసం SRM వర్సిటీ, IIT తిరుపతితో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. కాగా, చాలా రోజుల నుంచి రోడ్ల మీద ఉన్న గుంతల సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ విషయం తెలిసి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రోడ్ల సమస్యల వల్ల అనేకమంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో రోడ్లమీదకి రావడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడినప్పటికీ వారి సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. ఇక చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రోడ్ల సమస్యలను పరిష్కరించనున్నారు.