ఏపీలో 175 నియోజవర్గాలు 25 ఎంపి స్థానాల్లో BRS అభ్యర్థులు పోటీ చేస్తారని పేర్కొన్నారు BRS ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. దర్యాప్తు సంస్థల వేధింపులకు BRS భయపడదని.. కవితపై ఈడి కేసు బీజేపీ కక్ష పూరిత చర్య అని ఫైర్ అయ్యారు. ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థల్ని వేట కుక్కల మాదిరి వదులుతుందని.. ప్రభుత్వాలను కూల గొట్టెందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని వెల్లడించారు. బిజెపికి జాతీయ స్థాయిలో BRA ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అన్నారు.
రాష్త్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేసిందని.. పోలవరం, ప్రత్యెక హోదా విషయంలో మోసం చేసిందని ఆగ్రహించారు. రాజధాని విషయంలో పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఆడుతోందని.. 10 ఏళ్లు హోదా ఇస్తామన్న ప్రధాని హామీ ఏమైందని నిలదీశారు. బిజెపికి చిత్త శుద్ధి లేదు కాబట్టి ఏపి అభివృద్ధికి సహకారం అందించడం లేదని.. రాజకీయ నిరుద్యోగులు మాత్రమే బిజేపీలో చేరతారన్నారు. త్వరలో ఏపిలో భారీగా చేరికలు ఉంటాయి.. టిడిపి, వైసీపీలు ఏపికి అన్యాయం చేశాయని మండిపడ్డారు.
పెట్టుబడుల పేరుతో టిడిపి మోసం చేసింది ఇప్పుడూ వైసీపీ కూడా అదే చేస్తోందన్నారు BRS ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్.